Little Things To Listen

హైస్కూల్ విద్యాసమయం అత్యంత విలువైన కాలం.

పదవతరగతి పబ్లిక్ ప్రతి ఒక్కరు శ్రద్ద పెట్టి చదువు అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే చదువులో పదవతరగతి చాలా కీలకమైనది, పది పాస్ అయితేనే, కళాశాల చదువులు. వినడమే అలవాటు అయిన బాల్యంలో పిల్లలకు అప్పుడప్పుడు పరీక్షలు వ్రాయడం అలవాటు అయినా పదవతరగతి పబ్లిక్ పరీక్షలు అంటే తప్పనిసరిగా తప్పుతామేమో అనే భయం ఉంటుంది. ఇంకోపక్క మంచి మార్కులు సాధించాలనే పట్టుదల, పాస్ అవ్వలానే ఆశ ఉంటాయి. కానీ అందరూ పుస్తకం చదువుతారు, కొందరే విషయం గ్రహిస్తారు అని కొందరు అంటారు. కాదు అందరూ చదువుతారు, కొందరే శ్రద్ద పెడతారు. శ్రద్ద లేకపోవడం చేతనే అందరూ చదివిన సబ్జెక్టులో సారం గ్రహించలేరు. మీకు మీరు ఆసక్తి పెంచుకుని, ఒక క్రమశిక్షణతో శ్రద్ద పెడితే చదువులో మీరు అనుకుంటున్న దానికంటే మంచి ఫలితాలు సాధిస్తారు. “మీరు నా మాటలు లిటిల్ థింగ్స్ టు లిజన్ మొబైల్ యాప్ ద్వారా వింటున్నారు.” అయితే అంతకుముందరి తరగతి పరీక్షలలో వచ్చిన ఫలితాలను బట్టి, పబ్లిక్ పరీక్షలంటే ఒక అభిప్రాయానికి కొందరు బాలబాలికలు వచ్చేసి ఉంటారు. కొందరు ర్యాంకు సాధించాలని అనుకుంటే, కొందరు ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ అవ్వలాని అనుకుంటారు. కొందరు ఎలాగోలా పాస్ అయితే చాలు అనుకుంటారు. అంటే అంతకుముందరి తరగతులలో ఆయా స్టూడెంట్స్ కు చదువుపై మీకు కలిగించిన నమ్మకంతో వారు ఆవిధంగా అనుకుంటూ ఉండవచ్చును. అయితే సరైన ప్రణాళికతో చదవడం వలన, ఆసక్తితో సబ్జెక్టును తెలుసుకోవడం వలన, స్కూల్లో చెప్పిన పాఠ్యాంశాలను అవగాహన చేసుకోవడం, అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించడం, శ్రద్ద పెట్టి చదవడం ద్వారా పదవతరగతి పబ్లిక్ పరీక్షలలో మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చును. అయితే కష్టమైనా ఇష్టపడి చేస్తేనే, ఫలితం బాగుంటుంది. మీరు మరిన్ని మంచి మాటలు ముందు ముందు ఇంకా వినడానికి సిద్దంగా ఉండండి.

ఒక్కసారి ఆలోచించండి పదవతరగతికి ముందు మీరు ఏవిధంగా చదివారు, మార్కులు ఏవిధంగా వచ్చాయి. ఏవిధంగా ప్రతి పరీక్షకు సిద్దమయ్యారు, ఏవిధంగా ప్రతి పరీక్ష వ్రాసారు. సాదారణంగా ఎక్కువమంది పెద్దగా టెన్సన్ లేకుండానే పరీక్షలకు ప్రిపేర్ అయ్యి, వ్రాస్తూ ఉంటారు. వారు ప్రతి సంవత్సరం స్కూల్లో ఏవిధంగా మార్కులు తెచ్చుకుంటారో అదే విధంగా ప్రతిసారి ఫలితాలను కొంచెం అటుఇటుగా రాబడతారు. కానీ పదవతరగతి పబ్లిక్ పరీక్షల అనేసరిక, ఖచ్చితంగా పాస్ అయితే, చదువు కొనసాగింపు లేకపోతే, కొనసాగదు అని తెలుసుకుని, లేని భయాన్ని తెచ్చుకుని…పదవతరగతి క్లాసులకు వెళుతూ ఉంటారు. ఈ ఆలోచన తప్పు. అప్పటిదాకా మీరు ఎలా చదివారు? మీకు మార్కులు ఏవిధంగా వచ్చాయి? ఒక్కసారీ ఆలోచన చేయండి. “మీరు నామాటలు లిటిల్ ధింగ్స్ టు లిజన్ మొబైల్ యాప్ ద్వారా వింటున్నారు” తరువాత మీరు ఇంతకుముందు కన్నా మెరుగైన ర్యాంకుతో పదవతరగతి పాస్ కావాలంటే, ఖచ్చితంగా మీరు మీ భయాన్ని వదిలేయాలి. “గతంలో ఎలా చదివానో, అలానే చదవుతా అయితే ఇంకా కాస్త శ్రద్ద చూపుతాను, ఎందుకంటే ఈ మార్కులే నా సర్టిఫికెట్లలో నాపేరుపై నా మార్కులుగా ప్రింటు అవుతాయి. ఎక్కడికెళ్లినా ఈ మార్కుల గ్రేడును అందరూ చూస్తారు. కాబట్టి సర్టిఫికెట్లో చెరగని అక్షరాలుగా మారే నా చదువును ఇంకా శ్రద్ద పెట్టి చదవుతాను” అని మంచి సంకల్పం చేయండి. మీకన్నా బాగా చదివే వారితో, మీకు కలిగిన సందేహాలను, అర్ధం కానీ సబ్జెక్టును గ్రహించండి. మీరు మంచి మార్కుల కోసం చదివే సమయాన్ని శ్రద్దతో ఉపయోగించుకోవాలి. సబ్జెక్టులు వినడంలో శ్రద్ద, సబ్జెక్టు తెలుసుకోవడంలో ఆసక్తిని పెంచుకోవాలి. ఆసక్తికి శ్రద్ద తోడైతే, ఆ ఆసక్తి మీ శక్తిగా మారుతుంది. మీరు మునుపుకాలంలో ఎలా చదువంటే సరదాగా చదివారో, అంత సంతోషంతో సీరియస్ గా చదవండి. సీరియస్ చదవలేకపోతున్నాను అని అనుకోకుండా, సీరియస్ గా చదువుపై శ్రద్ద పెట్టండి.. తరువాతి ఆడియోలో వీక్ సబ్జెక్టుపై పోకస్ ఎలానో చూద్దాం!

హైస్కూల్ చదువులో ఎవరికి ఏ సబ్జెక్టులో ఇష్టం పెరిగితే, ఆ సబ్జెక్టులో శ్రద్ద పెడితే, ఆ సబ్జెక్టుకు సంభందించిన డిగ్రిలో పరిశోధనా డిగ్రి కూడా చదవవచ్చును. మీకు ఇష్టం ఉన్న సబ్జెక్టు ఏది అంటే, ఏ సబ్జెక్టులో ఎక్కువ మార్కులు ఎప్పుడూ వస్తున్నాయో అదే, ఇంకా చెప్పలాంటే, చదివేటప్పుడు ఏ సబ్జెక్టు చదవాల్సిన సమయానికి మనసు హాయిగా ఉంటుందో ఆ సబ్జెక్టు మీరు బాగా ఇష్టపడుతున్న సబ్జెక్టు. మరి మిగిలిన సబ్జెక్టులు ? అవి అలవాటుగా చదువుతూ మార్కులు మీకు ఇష్టమైన సబ్జెక్టుకు దరిదాపులుగా వస్తూ ఉంటాయి. సరిగా చదవనప్పుడు మరీ తక్కువ వస్తాయి. కానీ మీకిష్టమైన సబ్జెక్టులో సాదారణంగా మార్కులు తగ్గవు. అయితే అన్ని సబ్జెక్టులలో మంచిమార్కులు వస్తేనే, పదవతరగతితో మంచి ర్యాంకు సాధించగలం. మాథ్స్ సబ్జెక్టు మీకు బాగా ఇష్టమైతే, ఆ సబ్జెక్టుతో బాటు తెలుగు, హిందీ, ఇంగ్లీషు, సైన్సు, సోషల్ సబ్జెక్టులలో కూడా మార్కులు శాతం బాగుండాలి. అయితే కొందరు ఏదో ఒక సబ్జెక్టును కష్టమైన సబ్జెక్టుగా ఆలోచన చేస్తూ ఉంటారు. కొందరు మాథ్స్ కష్టమనుకుంటే, కొందరు సైన్స్ కష్టమనుకుంటారు. సాదారణంగా ఈ రెండు సబ్జెక్టులలో కష్టం అనుకుంటారు. మీరు మెదడు పదును పెట్టడంలో శ్రద్ద చూపితే, మాథ్స్, సైన్సు కష్టం కాదు.

ఇక్కడే ఈ సమయంలోనే మనం చదివినా ఏదైనా ఆటలో ఆసక్తి చూపించి, ఆ ఆటలో నైపుణ్యం సాధించాలన్న పునాది ఇక్కడే. హైస్కూల్ చదువుతున్న వయస్సులోనే, ఆసమయంలోనే మన ఇష్టమేంటో మనం తెసుకోవాలి. చదువుపై ఇష్టం ఉంటే, వింటున్న పాఠ్యాంశాలలో సారంశం గ్రహించడం, ఆయా పాఠాలలో కొత్త విషయాలను తెలసుకోవడం లో ఆసక్తి చూపడానికి మూలం ఇక్కడే! మన ఇష్టమేంటో మనం తెలుసుకోవాలి, మనం ఎవరికైనా చదువులో సందేహం తీరుస్తున్నాము అంటే ఆ సబ్జెక్టులో మనకు అవగాహన ఎక్కువ. “లిటిల్ థింగ్స్ టు లిజన్ మొబైల్ యాప్ గూగుల్ ప్లేస్టోర్ నుండి ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోండి.” ఆ సబ్జెక్టును అనుసరించి ఉన్న సబ్జెక్టులు, మిగిలిన సబ్జెక్టులపై శ్రద్ద పెడితే, పెద్ద చదవులు చదవడానికి పునాది ఇక్కడే..ఈహైస్కూల్ విద్యాసమయమే! వినడం అలవాటు అయిన మనకు, మనం వినేది ఎక్కువగా చదువుకు సంబంధించిన విషయాలే అయితే, చదువుపై ఆసక్తి ఇంకా పెరుగుతుంది. అదే ఇతర విషయాలు సినిమాలు, వీడియో గేమ్స్ అలవాటు అయితే, కాలం కాలక్షేపంగా ఖర్చు అయిపోతుంది. మనం నీరు వృధా చేస్తే, మనతోటివారికి నీరు అందక, వారికి నీటి నష్టం. కానీ కాలం ఖర్చు అయితే ఆఫలితంగా ఖచ్చితంగా మనకే…మనమే మనకున విలువైనా కాలాన్ని ఏవిధంగా ఖర్చు చేస్తే, ఆవిధంగా ఫలితం అనుభవించాలి.

“లిటిల్ థింగ్స్ టు లిజన్ మొబైల్ యాప్ గూగుల్ ప్లేస్టోర్ నుండి ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోండి.”

కాలం కాంచన తుల్యం అన్నారు పెద్దలు. కాంచనం అంటే బంగారం. బంగారం కన్నా విలువైనది వజ్రం, మరి వజ్రంతో పోల్చవచ్చును కదా! అయితే వజ్రం అందరికి ఆశ ఉండదు, అవసరం ఉండదరు. కానీ బంగారం అందరికీ ఆశ ఉంటుంది, అందరిలో హుందాతనం తెస్తుంది. ఎవరి స్థోమతను బట్టి వారి తోటివారిలో బంగారం మనకు హుందాతనం తెస్తుంది. ఇక్కడ మనిషి జీవితమే కాలంతో ముడిపడి ఉంది. అందరూ బంగారమంటే ఆసక్తి, అందుకేనేమో కాలం కాంచన తుల్యం అని ఉంటారు. కాలాన్ని సద్వినియోగం చేసుకున్నవారు, జీవితాన్ని బంగారుమయం చేసుకుంటారని పెద్దలు చెబుతారు. అటువంటి కాలాన్ని మంచివిషయాలు నేర్చుకోవడంలో ఉపయోగించుకోవాలం, జీవితాన్ని ఆదర్శప్రాయంగా మలుచుకోవాలంటే, శ్రద్దాసక్తులు అవసరం, అవి మనకు హైస్కూల్ విద్యాసమయంలోనే అలవాటు అవుతాయి. వినే వయస్సు, వింటున్న విషయంలో ఆలోచనలు కలిగే వయస్సు హైస్కూల్ చదువుతున్న వయస్సు. ఈ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *