Little Things To Listen

తెలుగు వెలుగు వ్యాప్తికి తెలుగువారిగా..

దేశభాషలందు తెలుగు లెస్స అన్నారు.. శ్రీకృష్ణదేవరాయలు గారు…ఆయన కొలువులో అష్టదిగ్గజాలు ఉండేవారని మనం చదువుకున్నాం. అష్టదిగ్గజాలు అంటే గొప్ప పండితులుగా చెబుతారు. పండితులు చెప్పే అలాంటి గొప్ప గొప్ప పాండిత్యం తెలియాలంటే, శ్రీకృష్ణదేవరాయలువారికి ఎంత పాండిత్యంపై అవగాహన ఉండి ఉండాలి. అంత గొప్పవారిచేత కితాబు అందుకున్న తెలుగు భాషలో నైపుణ్యం సాధించడానికి నేడు విద్యార్ధులు ఎంతవరకు కృషి చేస్తున్నారు?

తెలుగు వాడుక భాషలో సామెతలు, చలోక్తులు ఉంటూ సరదగా మాట్లాడే మాటలలో కూడా తత్వ విషయాలు ఉండడం చాలా పెద్ద విషయంగా తెలుగు భాష గొప్పతనంగా చెబుతారు. అలాంటి తెలుగు వాడుక భాషలో అమ్మనాన్న పదాలను మమ్మీడాడి పదాలు ఆక్రమించేశాయి… బాబయి, మావయ్య పదాలకు అంకుల్ ఒక ఆంగ్ల పదమే సమాధానం అయ్యింది… అత్తయ్య, పిన్ని పదాలకు ఒక ఆంగ్ల పదమే ఉంది. అంటే ఆంగ్ల కమ్యూనికేట్ చేయడానికి ఒక షార్ట్ కట్ భాషగా ఉంటుంది కానీ… బంధాలను కూడా సరిగా కలపలేదు..

పెద్దలమాట-చద్దిమూట ఈ సామెత తెలిసినవారికి ఎంతోకొంత పెద్దలపై ఖచ్చితంగా గౌరవం ఉంటుంది, అంటారు. ఆసామెత తెలియదు అంటే… వారు ఆంగ్ల భాష వాడుక ఎక్కువగా చేస్తూ, తెలుగు అంటే నిర్లక్ష్యం ఉండి ఉండాలి అని కూడా కొందరు పెద్దలు అంటారు. పెద్దలు చెప్పే మాటలలోనే సలహాలు దాగి ఉంటాయి, అని అంటారు. వారి అనుభవంతో తమ తరువాతివారు చేయబోయే పనులలో ఎదురుకాబోయే సమస్యల గురించి ఊహాత్మక మాటలు ఉండడంచేతననే పెద్దలమాట-చద్దిమూట అని ఉండవచ్చును.

ఇలా మన తెలుగు భాష వెలుగును నింపే భాషగా మనకు ఉండడం మనకు అదృష్టమే.. ఆంగ్లం అవసరమైతే అది ఆర్జన కొరకు మాత్రమే.. కానీ తెలుగు భాషలోనే మన జీవితానికి మంచి మేలును చేకూర్చే గొప్ప అవకాశం ఉంటుంది. గొప్ప గొప్ప గ్రంధాలు సంస్కృతం నుండి తర్జుమా అయ్యి తెలుగులో అందుబాటులో ఉన్నాయి. సంస్కృతం నుండి తర్జుమా అయిన పుస్తకాలు చదవాలంటే, తెలుగు వ్యాకరణంలో కూడా కొంచెం అవగాహన ఉండాలి, అంటారు. ఇప్పట్లో మనకు కొన్ని వాడుక తెలుగు పదాలకు కూడా సరైన అర్ధం తెలియదు, అని కొందరు అంటారు..

తెలుగు వెలుగు అంటే మరీ తెలుగు ఒక భాష కానీ టార్చిలైట్ కాదు… కానీ జీవన గమ్యాన్ని మార్చే మార్గాన్ని చూపే సాహిత్యం తెలుగు భాష వలననే మన తెలుగు వారికి సాధ్యం. తెలుగులో లభించే సాహిత్యం సాంకేతిక పరిజ్ఙానంతో సాంకేతిక పరికరాల ద్వారా కూడా మనకు అందుబాటులో ఉంటున్నాయి. స్మార్ట్ మొబైల్స్ ద్వారా తెలుగు సాహిత్యాన్ని ఆడియో/వీడియో/ ఆర్టికల్స్ రూపంలో అందించే మొబైల్ యాప్స్ అనేకంగా మనకు లభిస్తున్నాయి.

ఆంగ్లం వాడుకలో లేక సాంకేతిక పరిజ్ఙానం వినిమయానికి ఉపయోగపడుతుంది, కాబట్టి అది అవసరం. అవసరాలకు ప్రాధాన్యతను ఇస్తూ మేలుచేసే అమ్మను మరువనట్టు, ఇతర భాషలు అవసరానికి తగ్గట్టుగా నేర్చుకున్నట్టే, మనకు కన్నతల్లిలాంటి తెలుగు భాషను కూడా ఇష్టంగా నేర్చుకోవాలి.

తెలుగు పధ్యాలు పలకడానికి కష్టంగా ఉంటే, వాటిని ఒకటికి పదిసార్లు వినడంతో మనకు వచ్చేస్తాయి. అలా తెలుగు పద్యాలను మొబైల్ యాప్ ద్వారా వినడానికి, లిటిల్ థింగ్స్ టు లిజన్ ఆండ్రాయిడ్ యాప్ మీ ఆండ్రాయిడ్ ఫోన్లో డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ చేయండి లేక క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *