Little Things To Listen

వినడం – చదువుకుని ఉండడం?

వినడంతో నేర్చుకోవడం మొదలు అయితే, వినడానికి వచ్చినవారికి అప్పటికి ఎంతో కొంత విషయం తెలిసే ఉంటుంది. అలా తెలిసిన విషయం, ఎవరో ఒకరి దగ్గర నేర్చుకునే ఉంటారు. ఊహ తెలియకముందు అమ్మ, అమ్మమ్మ, నానమ్మ చెప్పివన్ని నేర్చుకుంటూ ఉంటే, ఊహ తెలుస్తున్నప్పుడు…నాన్న చెప్పినవి.. నేర్చుకుంటే ఉంటాం… ఆడుకుంటున్నప్పుడు తోటివారితో నేర్చుకోవడం… అలా బాలబాలికలందరూ ఎంతోకొంత తమ స్థితిగతులనుసరించి నేర్చుకునే ఉంటారు.

తెలియనితనంలో వినడం ఎక్కువగా ఉంటే, తెలుస్తున్న సమయంలో వినడం తక్కువ అవుతుంది, అంటారు. ఏమి తెలియనితనంలో వినేటప్పుడు, మనసు ఏకాగ్రతతో వింటే, కొంత ఊహ తెలిసాక మాత్రం మనసు, ఒక విషయం వింటున్నప్పుడే, మరొక విషయంవైపు వెళుతుంటుంది, అంటారు. మరొక విషయం మనసులోకి వచ్చాకా, వింటున్న విషయంలో సారాంశం అర్ధం చేసుకోలేరు.

కొంత అవగాహన ఏర్పడటప్పుడే, అవగాహనలో ఉన్న విషయాలపై సొంత ఆలోచనలు ఎక్కువగా ఉన్నప్పుడు, ఏదైనా ఇతర విషయాలపై మనసు దృష్టి పెట్టినప్పుడు మాత్రం ఎదుటివారు, చెప్పే విషయం కన్నా తమ మనసులో ఉన్న విషయాలతోనో లేక ఆసక్తి కలిగిన విషయాల కోసమో కొందరు సతమతమవుతూ ఉంటారు. ఇలాంటి వాటిలో వచ్చి చేరే అంశాలు, ఆవ్యక్తి యొక్క పరిసరాలను బట్టి ఉంటాయి.

తమకు తాముగా నేర్చుకుంటున్న సమయంలో ఆసక్తిని బట్టి కొన్ని కొన్ని పెద్దలు లేక విద్యాలయాలు నిర్ధేశించిన విషయాలలో వినడం అనే సమస్య ఏర్పడుతుంది. తమ ఆసక్తి ఒకలాగా ఉంటే, పెద్దల ఆలోచన ఇంకోలాగా ఉండడం పదవతరగతి తర్వాత తలెత్తే సమస్య అయితే, కొందరు బాలురు మాత్రం మాములుగా పాఠాలు వినడంలో కూడా ఆసక్తి కనబరచరు. అయితే ఈరోజుల్లో పెరిగిన సాంకేతిక పరిజ్ఙానం కారణం చేత, అందరికి అక్షరజ్ఙానం అవసరం.

ఆటలలో నైపుణ్యం ఉండి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటే, అలా గుర్తింపు పొందినవారికి, వారి..వారి మాతృభాషతో బాటు జాతీయ, అంతర్జాతీయ భాషలు వచ్చి ఉండాలి. లేకపోతే ఇతరుల మీద ఆధారపడాలి. అందరూ అన్నింటిలో రాణించలేరు, కానీ ప్రాధమికంగా కొన్ని అంశాలు అందరికి తెలిసి ఉండాలి.

అలా తెలుసుండవలసిన విషయాలలో మనకు కుటుంబ పరిసరాలు, కుటుంబ పెద్దలు ద్వారా, స్నేహితులు ద్వారా కొన్ని తెలిస్తే, చదువు ద్వారా తెలిసేవి కొంత ఎక్కువగానే ఉంటాయి. ఒక్కోసారి.. ఎవరైనా ఒకరు తమ తల్లిదండ్రుల కోసం తాము ప్రత్యేకంగా చేయవలసిన కొన్ని పనులు కూడా పుస్తకం ద్వారా చదివి తెలుసుకునే అవకాశం లేకపోలేదు. సాధారణంగా ఇవి ఇంటి సంప్రదాయాన్ని అనుసరించి తెలుస్తాయి. తల్లిదండ్రుల విషయంలోనే కొంతమందిలో ఇలా ఉంటే, మిగిలిన సామాజిక విషయాలలో అందరికి అన్ని చదువు లేకపోతే తెలిసే అవకాశం ఉండదు.

చదువుకుని ఉండడం వలన ఇంతకుముందరి చరిత్ర మనం పుస్తకపఠనం ద్వారా తెలుసుకోవచ్చును. చదువుకుని ఉండడం వలన, మనకు బాగా వచ్చిన సబ్జెక్టులో సందేహాలకు ఇతరులను సమాధానపరచవచ్చును. చదువుకుని ఉండడం వలన, సామాజిక పరిస్థితులలో గతమెలా ఉండేది, ఇప్పటి సామాజిక పరిస్థితులలో గతం గురించి జరుగుతున్న ప్రచారంలో వాస్తవం తెలుసుకోవచ్చును. పుస్తక పఠనం ద్వారా….

చదువుకుని ఉండడం వలననే ఇప్పటి లేక రేపటి సాంకేతికతను సద్వినియోగం చేసుకుని, ముందుకు సాగగలం, లేకపోతే ఇతరులపై ఆధారపడాలి. చదువుకుని ఉండడం వలననే ఉద్యోగం చేయడానికి. ప్రాధమిక అర్హత ఏర్పడుతుంది. చదువుకుని ఉండడం వలననే అనేక విషయాలపై అవగాహన ఏర్పడగలదు…. ఇలా ఎన్లో ఉపయోగాలు ఉంటాయి.

అందరూ ఒకలాగ ఉండనట్టే, అందరూ ఒకేలాగ ఆడలేనట్టే, అందరూ ఒకలాగ, ఒకేమాదిరి చదువుపై ఆసక్తి కనబరచలేరు. కానీ చదువు ఆవశ్యకతను తెలుసుకుంటే, ఆసక్తి ఆలస్యంగానైనా వస్తుంది. ఆసక్తి పెరిగితే… చదువుకోవడంలో పిల్లలు ముందంజలో ఉంటారు

ఐధింక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *