Little Things To Listen

ఆసక్తికరం పదవ తరగతి పరిజ్ఙానం

లిజన్ లిటిల్ థింగ్స్ బికమ్స్ బిగ్ థింగ్స్ – లిజన్ లిటిల్ థింగ్స్ అంటే వినండి… చిన్న విషయాలు అవే తర్వాతి కాలంలో పెద్ద విషయాలుగా ఉంటాయి. నేర్చుకునే సమయంలో నేర్చుకునేవారు దగ్గరి జ్ఙానం, నేర్పేవారు కన్నా తక్కువే. అలా ఉంటేనే కదా… నేర్చుకునేవారు వెళ్లి విషయాలు గురించి నేర్చుకునేది. చిన్ననాడు చదువులో నేర్చుకున్నవారి పరిజ్ఙానానికి పదవతరగతి పరిక్షకాలం..

నేర్చుకోవడంలో ఉండవలసినది ముఖ్యంగా ఆసక్తి, నేర్చుకోవాలి అనుకుంటున్న విషయంలో ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉంటే మనిషికి మార్గం ఉంటుంది, అంటారు. ఆసక్తి ఉన్నవారు, వారికి ఏవిషయంలో ఆసక్తి ఉంటే, ఆ విషయంలో నిష్ణాతులుగా మారినా ఆశ్చర్యం చెందనవసరం లేదు. ఆసక్తి యొక్క శక్తి అటువంటిది.

అటువంటి ఆసక్తి.. పిల్లల్లో కొందరికి చదువుపై ఆసక్తి ఉంటే, మరి కొందరికి ఆటలలో ఆసక్తి ఉంటుంది. కొందరి చేతి పనులలో ఆసక్తి ఉంటుంది. ఇంకా వివరణగా చూస్తే చదువులో కొందరు వ్రాయడంలో ఆసక్తి చూపుతూ అక్షరాలను ప్రింటు వేసినట్టుగా వ్రాసేంతగా నేర్పరులు అవుతారు. మరికొందరు ఏదోక సబ్జెక్టులో ఆసక్తి కనబరస్తూ, భవిష్యత్తులో ఆయా రంగంలో పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. సోషల్ వైపు ఆసక్తి కనబరిస్తే, సోషల్ సర్వీసులలో ఐఏఎస్ అవ్వవచ్చు. సైన్స్ వైపు ఆసక్తి చూపితే డాక్టర్ అవ్వవచ్చు లేకపోతే శాస్త్ర వేత్తగా మారవచ్చు. లెక్కలలో ఆసక్తి ఉంటే మంచి ఇంజనీరుగా మారవచ్చును. ఆసక్తి చాలా శక్తివంతమైనది.

ఆటలలో ఆసక్తి, ఏ ఆటలో ఆసక్తి ఉంటే, ఆయా ఆటలలో సరైన ప్రోత్సాహం లభిస్తే జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించవచ్చును. పాటలలో ఆసక్తి ఉంటే, మంచి గాయని, గాయకులుగా మారవచ్చును. ఇలా నేర్చుకునే సమయంలో నేర్చుకోవాల్సిన వయస్సు ఉన్నవారి ఆసక్తిని బట్టి, వారు ఆయా రంగాలలో రాణించడానికి ఆసక్తి ఉంటే, సాంకేతికంగా విషయజ్ఙానం చాలా సులభంగా లభిస్తుంది. అయితే ఆసక్తి ప్రధానంగా ఉంటే, క్రమశిక్షణ, సాధన, నిర్ణీత సమయపాలన, వినయం ఇవ్వన్ని అతనికి సహాయం కాగలవు.

అక్షరజ్ఙానం అందరికీ అవసరమే

అంత శక్తివంతమైన ఆసక్తి అన్ని విషయాలలో సమంగా లేకపోయినా నేర్చుకునే విషయాలలో ముఖ్యంగా చదువులో అందరి పిల్లలకు తప్పనిసరి. చదువు విషయాల పట్ల అవగాహన ఏర్పడడంలో ఎంతో సహాయకంగా ఉంటుంది. చేయదగినది..చేయకూడనది… అనే విషయం అక్షర జ్ఙానం ఉండడం వలననే కదా… అందరికీ తెలిసేది.

ఒక వస్తువు కొంటే ఆవస్తువు ఎలా ఉపయోగించాలి అనే మాన్యవల్ అక్షరరూపంలోనే ఉంటే, దానిని చదవడానికి అక్షరజ్ఙానం తప్పనిసరి. సమాజంలో అలవాటుగా ఉన్న విషయాలలో కొన్నింటిలో మాత్రమే అక్షరజ్ఙానం లేకుండా సాగినా, చాలా విషయాలలో అక్షరజ్ఙానం అవసరమని అనుభవజ్ఙులు అంటూ ఉంటారు.

కొందరు అనుభవజ్ఙులు తమ మాటలలో “చదువుకునే వయస్సులో మాపెద్దలు..చెప్పినా…వినకుండా చదవుపై సరిగా శ్రద్ద లేకపోడం వలననే…జీవితంలో ఇంకా ఎదగలేక..ఇక్కడవరకే..ఆగిపోయాం” అనేవారు కూడా మనకి సమాజంలో తారపడుతూ ఉంటారు. అంటే సొంత వ్యాపారం అయిన, సొంత సేవా సంస్థ అయినా కనీస అక్షరజ్ఙానం అవసరం

ఇంటర్నెట్, సాంకేతిక పరికరాలు, వివిధ పరిశ్రమల వలన ప్రాంతీయ భాషా ప్రాంతాలలో కూడా ఇతర భాష అవనసరం ఏర్పడడం కూడా ఇప్పుడు జరుగుతుంది. ఇకామర్స్ బిజినెస్ లేక సర్వీసులు అయితే ఏప్రాంతం వారైనా ఇంగ్లీషు, హిందీ పరిజ్ఙానం కూడా అవసరమే. అవి ఉంటే ఇంకా సంపాదన లేక సేవా వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది.

కనీస అక్షర జ్ఙానం మనకు తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషలలో ఈరోజుననుసరించి అవపరం అయితే, ఇంకా సామాజిక పరిస్థితుల గురించి అవగాహన, మన సామాజిక చరిత్ర గురించి తెలిసి ఉంటే, సామాజకి మార్పులకు ఆవశ్యకతను గుర్తించగలం. సామాజిక జ్ఙానం ఉంటే, రాజకీయాలలో స్వార్ధ రాజకీయాలను గుర్తించగలం. ఈవిధంగా చూసినప్పుడు మనకి సోషల్ మరీ ముఖ్యంగా ఉంటుంది.

సైన్సు మానవమేధకు గుర్తింపు దీనివలననే ఎక్కువగా సమాజంలో వస్తూ ఉంటుంది. సైన్సులో ఆసక్తి కనబరుస్తూ, సైన్సుని నేర్చుకుంటే, అలా నేర్చుకున్నవారు సమాజంలో ఆసక్తిని సృష్టించేవిధంగా కొత్త విషయాలను కనుగొనగలరు. ఇలా ప్రతీ సబ్జెక్టులోను ఎంతోకొంత పరిజ్ఙానం ప్రతివారికి అవసరమే నేటి సమాజంలో…

హైస్కూల్ విద్య ప్రతి సబ్జెక్టు పరిచయం ప్రతి విద్యార్ధికి…

ప్రతివారికి ప్రతి సబ్జెక్టులో ఎంతోకొంత పరిజ్ఙానం ఇవ్వగలిగేది హైస్కూల్ విద్య అయితే, హైస్కూల్ చదువుతున్న వయస్సే.. తమకు తాముగా ఆలోచన చేస్తూ తమకు నచ్చినట్టుగా పిల్లలు నడుచుకునే వయస్సుకు మారే సమయం కూడా అదే వయస్సు… అలాంటి సమయంలో తారాస్థాయిలోకి చేరే పరిణితికి, విద్యార్ధి చదువు భవిష్యత్తును నిర్ధేశించే సమయం కూడా అదే పదవతరగతి చదివే వయస్సు…

ఇక్కడ వరకు తమకు ఏఆసక్తి ఉన్నా పెద్దవారికి భయపడి లేక ఇతర కారణాల చేత తమ ఆసక్తిని కనబరచరు. ఇక్కడ పెద్దలు తమ తమ పిల్లల ఆసక్తిని గుర్తించే ఆయా విషయాలలో ప్రోత్సాహం ఇస్తూ పదవతరగతి పాస్ ప్రాధన్యతను వివరిస్తే… పట్టుకునే వయస్సులో సరైన విషయం పట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

బిడియపడుతూ ఉండే వయస్సులో బిడియం పోయే సమయంలో చేరిన విషయం మనస్సుని ఆక్రమిస్తుంది. ఇక్కడ జీవితానికి సంభందించి ఆయా కుటుంబ సామాజికి పరిస్థితులను బట్టి ఆయా విద్యార్ధులకు కావాలసిన విషయాల వైపు దృష్టి పెట్టాలాగా చూస్తే… సదరు విద్యార్ధి,, వారి తల్లిదండ్రులు ఒక మెట్టు పైకి ఎక్కినట్టే…..

ఐథింక్ లిటిల్ థింగ్స్ బికమ్స్ బిగ్ థింగ్స్ ఇన్ ప్యూచర్……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *