Little Things To Listen

క్లాసు రూం పాఠాలు…పాటలుగా వింటే…

తెలుగులో 10th Class సబ్జెక్టులు వాయిస్ ద్వారా వినడం వలన ముందుగానే ఆయా సబ్జెక్టులలో అవగాహన ఏర్పడుతుందని, అలా వాయిస్ ద్వారా 10th Class పాఠాలు వినాలనే విద్యార్ధుల కొరకు, ఈ మొబైల్ యాప్ ద్వారా 10వ తరగతి సబ్జెక్టులలో లెసన్స్ వాయిస్ రూపంలో అందిస్తున్నారు… శ్రీమతి పద్మగారు. వాయిస్ రూపంలో తెలుగు మరియు ఇతర సబ్జెక్టు పాఠాలు వినడానికి ఇక్కడ ఇవే అక్షరాలను తాకండి.

వినడం వలననే విద్య వస్తుంది, అయితే వినాలనే శ్రద్ద కలగడం చాలా ముఖ్యమంటారు. కొంతమందికి క్లాసులో వినేటప్పుడు సబ్జెక్టుపై అంతగా ఆసక్తి ఉండకపోవచ్చును. కొంత మంది ఆసక్తి ఉన్న చదవడానికి చికాకు ఉండవచ్చును. ఇంకా చెప్పేవారిలో కొందరి వాయిస్ అందరికీ అర్ధం అయ్యేలాగా ఉండకపోవచ్చును. ఇలా కొన్ని సమయాలలో కొంతమందికి క్లాసురూములో పాఠాలు ఆసక్తిని కలుగజేయకపోవచ్చు.

ఆసక్తి లేకుండా చదువులో శ్రద్ధ చూపడం కష్టమంటారు. అలాంటప్పుడు ఆసక్తి కలగడంలో అవకాశం ఉండే విషయాలు గమనిస్తే….

మనసుకు ముందుగా తెలిసి ఉన్న విషయం, ఆ మనిషికి తెలిసినవారు ఎక్కడైనా మాట్లాడుకుంటూ ఉంటే, చూసిన మనసు, తనకు ముందుగానే పరిచయం ఉన్న విషయంపై ఆసక్తి కనబరిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా అయితే 9వ తరగతి విద్యార్థులు 10వతరగతికి వెళ్లే వేసవిలో 10వతరగతి పాఠాలు, పాటలు విన్నట్టుగా చక్కని వాయిస్ ద్వారా వింటే, తర్వాత క్లాసురూంలో ఆయా సబ్జెక్టులలో ఆసక్తి పెరగవచ్చు. ఇంకా శ్రద్ధ కూడా పెరుగుతుంది.

ఎప్పుడూ ఖాళీ సమయాలలో సినిమా పాటలే కాకుండా రోజూ కొంత నిర్ణీత సమయంలో సబ్జెక్టుకు సంభందించిన విషయాలు వింటూ ఉంటే, ఆయా సబ్జెక్టులలో ఆసక్తి పెరిగే అవకాశం ఉంటుంది.

తనంతటతానుగా శ్రద్ద పెడితే, విద్యార్ధులు సాధించలేనిది అంటూ ఏమి ఉండదు.. అంటారు. అటువంటి శ్రద్ద ఉన్న విద్యార్ధుల తల్లిదండ్రులు అదృష్టవంతులు అయితే మిగిలినవారు కూడా దృష్టి పెడితే… చదువుపై శ్రద్ధ కలగడం పెద్ద విషయం కాదు. Practice makes perfect అన్నట్టుగా చదవగా చదవగా శ్రద్ద పెరగుతుంది. చదవడం కన్నా ముందు క్లాసు రూంలో టీచర్ చెప్పే పాఠాలు వినడం వలన సబ్జెక్టు తెలుస్తుంది. అటువంటి క్లాస్ రూం పాఠాలు వాయిస్ రూపంలో మీ స్మార్ట్ ఫోను ద్వారానే వినాలంటే ఈ లిటిల్ థింగ్స్ మొబైల్ యాప్ మీ ఆండ్రాయిడ్ ఫోనులో డౌన్ లోడ్ చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *