వినడం వ్రాయడం చదవడం

చూచివ్రాత ఒక్కసారి వ్రాస్తే, పదిసార్లు చదవడంతో సమానం ! అంటే మన మైండుకు చూచి చదవడం కన్నా, చూచి వ్రాయడం కోసం కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటుంది. చూచి చదవడం తేలికైన పని, చూస్తూ చదువుతూ పేరాలు పేరాలు చదివేస్తూ ఉంటాం కానీ చూచి వ్రాయడంలో మైండు ఫోకస్ పెడుతూ, ఎక్కువ సమయం వెచ్చించాలి. ఏ విషయంపై మైండు ఫోకస్ చేసిందో ఆవిషయాన్ని గ్రహించి గుర్తుగా పెట్టుకుంటుంది. మైండు ఫోకస్ పెడితే లోకంలో నేర్చుకోలేనిది అంటూ ఏమి లేదు! మైండు ఫోకస్ చేయడంలో దానికి ఉపయోగపడే ప్రధాన విషయం వినడం! పుస్తకంలో పాఠాలు ఎలా చదవాలో టీచర్ ద్వారా విని తెలుసుకుని, అలా చదవడం మొదలుపెడతాం. పుస్తకంలో పాఠాలలో ఉన్న సారంశం టీచర్ ద్వారా విని తెలుసుకుంటాం! విని అనేక విషయాలు లోకంలో తెలుసుకుంటాం. ఇలా వినడం ద్వారా మనం పాఠాలు, పాఠాలలో సారంశం తెలుసుకుంటాం. రోజూ స్కూలుకు క్రమం తప్పకుండా వెళుతున్నామంటే, పాఠాలు వినడంలో ఉన్న శ్రద్ధే మూలం. విన్న పాఠాలు అర్ధం కాకపోయినా, లేక ఎప్పుడైనా క్లాసులు మిస్ అయినా మైండులో అశ్రద్ధ వచ్చి చేరుతుంది. అలా కాకుండా క్లాసు పాఠాలు అన్ని ఒక చోటే ఉంటే, మనం మిస్ అయిన…
Read More

అనిపించడంతో అనుకున్నాను, ఫలితం?

కొంతమంది ఒక్కొక్కసారి ఒక పని చేశాక అయ్యో ఇలా జరిగింది, నేను ఇంకొకలాగా అనుకున్నాను అని అంటూ ఉంటారు. అంటే వారు అక్కడ ఆపనిలో అంచనా తప్పుగా వేశారు, ఆ అంచనా ఖచ్చితం కాదు కాబట్టి వారు అనుకున్న విధంగా పని ఫలితం రాలేదు. ఏదైనా అనిపించడం వలన ఏదోకటి అనుకుని ఏదో ఒక పని ప్రారంభిస్తే ఆ పని ఫలితం అనుకోని విధంగానే ఉంటుంది. మనిషికి ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచన బాగుంది అనిపిస్తుంది, అలా అనిపించిన ఆలోచన పదే పదే మనసులో ఉంటే, ఏదో ఒకటి అనుకుని చేసేస్తు ఉండడం చేత ఆ పని ఫలితం ఒక్కోసారి అనుకున్న విధంగా వస్తే, మరొకసారి అనుకున్న విధంగా రాదు. అయితే ఫలిత ప్రభావం మాత్రం జీవితంపై పడుతుంది. అది ఎలా అంటే.... అనుకూలంగా ఫలితం వచ్చినప్పుడు పెట్టుబడి తక్కువ అయితే వచ్చే లాభం వందరూపాయిలే, ప్రతికూలంగా ఫలితం వచ్చినప్పుడు పెట్టిన పెట్టుబడి ఎక్కువ అయినప్పుడు నష్టం వేలల్లో, లక్షల్లో ఉంటుంది. ఆర్ధికపరమైన లాభనష్టాలు ప్రతివారి జీవితంపై ప్రభావం చూపుతాయి. అలాగే చదువులో సబ్జెక్టులలోని వివిధ అంశాలను క్లాసురూంలో చెప్పినప్పుడు ఆ లెసన్స్ అర్ధం చేసుకుని ఒక అవగాహనతో సాధన చేస్తూ ఉంటే,…
Read More

అతి ఆన్ లైన్ ఆటలలో కూడా ?

మొబైల్ గేమ్స్, వీడియో గేమ్స్ ఏదో ఆటవిడుపుగా ఉండాలి కానీ అలవాటు అయిపోకూడదు. ఫిజికల్ గా ఆటలు ఆడండి, ఓపిక మేర ఆడగలుగుతారు, మళ్లీ ఆడాలంటే శక్తి కోసం తినాలి, విశ్రాంతి తీసుకుని మరలా మరో సమయంలో ఆడతాం. అదే వర్చువల్లి ఆన్ లైన్ గేమ్స్ లేక వీడియో గేమ్స్ ఆడితే, రోజు తినే తిండే కదా, కాసేపు ఆగి తిందాం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ గేమ్స్ ఆడడానికి శక్తి ఎక్కువ అవసరంలేదు. ఫోన్లోనో, కంప్యూటర్లోనో ఆడేస్తూ ఉంటాం. ఎక్కువసేపు కూర్చునే ఓపిక ఉంటే, చాలు గేమ్స్ ఆడేస్తూ ఉంటాం. మొదట్లో సరదగా అనిపించే గేమ్స్ తర్వాత అలవాటుగా మారిపోతాయి. అలా మనల్ని వ్యసనపరులుగా మార్చే మొబైల్ గేమ్స్ మనకొద్దు, మన చదువే మనకు ముఖ్యం. గేమ్ ఏదైనా అటవిడుపు కోసమే కానీ, గేమ్ ఆడలేకుండా నేను ఉండలేను అనే స్థితికి మనం చేర కూడదు. కొత్త అలవాట్లను తెచ్చే స్మార్ట్ ఫోనును మనం మన మంచికి ఉపయోగిద్దాం! హైస్కూల్ పాఠాలను అప్పుడప్పుడూ ఫోను ద్వారా వినడం మొదలుపెడదాం… మీరు 8,9,10 వతరగతి పాఠాలను మీ స్మార్ట్ ఫోను ద్వారా వినాలంటే, ఇప్పుడే లిటిల్ ధింగ్స్ టు లిజన్ అనే ఐడి ద్వారా గూగుల్…
Read More

హైస్కూల్ విద్యాసమయం అత్యంత విలువైన కాలం.

పదవతరగతి పబ్లిక్ ప్రతి ఒక్కరు శ్రద్ద పెట్టి చదువు అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే చదువులో పదవతరగతి చాలా కీలకమైనది, పది పాస్ అయితేనే, కళాశాల చదువులు. వినడమే అలవాటు అయిన బాల్యంలో పిల్లలకు అప్పుడప్పుడు పరీక్షలు వ్రాయడం అలవాటు అయినా పదవతరగతి పబ్లిక్ పరీక్షలు అంటే తప్పనిసరిగా తప్పుతామేమో అనే భయం ఉంటుంది. ఇంకోపక్క మంచి మార్కులు సాధించాలనే పట్టుదల, పాస్ అవ్వలానే ఆశ ఉంటాయి. కానీ అందరూ పుస్తకం చదువుతారు, కొందరే విషయం గ్రహిస్తారు అని కొందరు అంటారు. కాదు అందరూ చదువుతారు, కొందరే శ్రద్ద పెడతారు. శ్రద్ద లేకపోవడం చేతనే అందరూ చదివిన సబ్జెక్టులో సారం గ్రహించలేరు. మీకు మీరు ఆసక్తి పెంచుకుని, ఒక క్రమశిక్షణతో శ్రద్ద పెడితే చదువులో మీరు అనుకుంటున్న దానికంటే మంచి ఫలితాలు సాధిస్తారు. "మీరు నా మాటలు లిటిల్ థింగ్స్ టు లిజన్ మొబైల్ యాప్ ద్వారా వింటున్నారు." అయితే అంతకుముందరి తరగతి పరీక్షలలో వచ్చిన ఫలితాలను బట్టి, పబ్లిక్ పరీక్షలంటే ఒక అభిప్రాయానికి కొందరు బాలబాలికలు వచ్చేసి ఉంటారు. కొందరు ర్యాంకు సాధించాలని అనుకుంటే, కొందరు ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ అవ్వలాని అనుకుంటారు. కొందరు ఎలాగోలా పాస్ అయితే చాలు అనుకుంటారు.…
Read More

వినడం – చదువుకుని ఉండడం?

వినడంతో నేర్చుకోవడం మొదలు అయితే, వినడానికి వచ్చినవారికి అప్పటికి ఎంతో కొంత విషయం తెలిసే ఉంటుంది. అలా తెలిసిన విషయం, ఎవరో ఒకరి దగ్గర నేర్చుకునే ఉంటారు. ఊహ తెలియకముందు అమ్మ, అమ్మమ్మ, నానమ్మ చెప్పివన్ని నేర్చుకుంటూ ఉంటే, ఊహ తెలుస్తున్నప్పుడు...నాన్న చెప్పినవి.. నేర్చుకుంటే ఉంటాం... ఆడుకుంటున్నప్పుడు తోటివారితో నేర్చుకోవడం... అలా బాలబాలికలందరూ ఎంతోకొంత తమ స్థితిగతులనుసరించి నేర్చుకునే ఉంటారు. తెలియనితనంలో వినడం ఎక్కువగా ఉంటే, తెలుస్తున్న సమయంలో వినడం తక్కువ అవుతుంది, అంటారు. ఏమి తెలియనితనంలో వినేటప్పుడు, మనసు ఏకాగ్రతతో వింటే, కొంత ఊహ తెలిసాక మాత్రం మనసు, ఒక విషయం వింటున్నప్పుడే, మరొక విషయంవైపు వెళుతుంటుంది, అంటారు. మరొక విషయం మనసులోకి వచ్చాకా, వింటున్న విషయంలో సారాంశం అర్ధం చేసుకోలేరు. కొంత అవగాహన ఏర్పడటప్పుడే, అవగాహనలో ఉన్న విషయాలపై సొంత ఆలోచనలు ఎక్కువగా ఉన్నప్పుడు, ఏదైనా ఇతర విషయాలపై మనసు దృష్టి పెట్టినప్పుడు మాత్రం ఎదుటివారు, చెప్పే విషయం కన్నా తమ మనసులో ఉన్న విషయాలతోనో లేక ఆసక్తి కలిగిన విషయాల కోసమో కొందరు సతమతమవుతూ ఉంటారు. ఇలాంటి వాటిలో వచ్చి చేరే అంశాలు, ఆవ్యక్తి యొక్క పరిసరాలను బట్టి ఉంటాయి. తమకు తాముగా నేర్చుకుంటున్న సమయంలో ఆసక్తిని బట్టి కొన్ని…
Read More

తెలుగు వెలుగు వ్యాప్తికి తెలుగువారిగా..

దేశభాషలందు తెలుగు లెస్స అన్నారు.. శ్రీకృష్ణదేవరాయలు గారు...ఆయన కొలువులో అష్టదిగ్గజాలు ఉండేవారని మనం చదువుకున్నాం. అష్టదిగ్గజాలు అంటే గొప్ప పండితులుగా చెబుతారు. పండితులు చెప్పే అలాంటి గొప్ప గొప్ప పాండిత్యం తెలియాలంటే, శ్రీకృష్ణదేవరాయలువారికి ఎంత పాండిత్యంపై అవగాహన ఉండి ఉండాలి. అంత గొప్పవారిచేత కితాబు అందుకున్న తెలుగు భాషలో నైపుణ్యం సాధించడానికి నేడు విద్యార్ధులు ఎంతవరకు కృషి చేస్తున్నారు? తెలుగు వాడుక భాషలో సామెతలు, చలోక్తులు ఉంటూ సరదగా మాట్లాడే మాటలలో కూడా తత్వ విషయాలు ఉండడం చాలా పెద్ద విషయంగా తెలుగు భాష గొప్పతనంగా చెబుతారు. అలాంటి తెలుగు వాడుక భాషలో అమ్మనాన్న పదాలను మమ్మీడాడి పదాలు ఆక్రమించేశాయి... బాబయి, మావయ్య పదాలకు అంకుల్ ఒక ఆంగ్ల పదమే సమాధానం అయ్యింది... అత్తయ్య, పిన్ని పదాలకు ఒక ఆంగ్ల పదమే ఉంది. అంటే ఆంగ్ల కమ్యూనికేట్ చేయడానికి ఒక షార్ట్ కట్ భాషగా ఉంటుంది కానీ... బంధాలను కూడా సరిగా కలపలేదు.. పెద్దలమాట-చద్దిమూట ఈ సామెత తెలిసినవారికి ఎంతోకొంత పెద్దలపై ఖచ్చితంగా గౌరవం ఉంటుంది, అంటారు. ఆసామెత తెలియదు అంటే... వారు ఆంగ్ల భాష వాడుక ఎక్కువగా చేస్తూ, తెలుగు అంటే నిర్లక్ష్యం ఉండి ఉండాలి అని కూడా కొందరు పెద్దలు అంటారు.…
Read More

ఆసక్తికరం పదవ తరగతి పరిజ్ఙానం

లిజన్ లిటిల్ థింగ్స్ బికమ్స్ బిగ్ థింగ్స్ - లిజన్ లిటిల్ థింగ్స్ అంటే వినండి... చిన్న విషయాలు అవే తర్వాతి కాలంలో పెద్ద విషయాలుగా ఉంటాయి. నేర్చుకునే సమయంలో నేర్చుకునేవారు దగ్గరి జ్ఙానం, నేర్పేవారు కన్నా తక్కువే. అలా ఉంటేనే కదా... నేర్చుకునేవారు వెళ్లి విషయాలు గురించి నేర్చుకునేది. చిన్ననాడు చదువులో నేర్చుకున్నవారి పరిజ్ఙానానికి పదవతరగతి పరిక్షకాలం.. నేర్చుకోవడంలో ఉండవలసినది ముఖ్యంగా ఆసక్తి, నేర్చుకోవాలి అనుకుంటున్న విషయంలో ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉంటే మనిషికి మార్గం ఉంటుంది, అంటారు. ఆసక్తి ఉన్నవారు, వారికి ఏవిషయంలో ఆసక్తి ఉంటే, ఆ విషయంలో నిష్ణాతులుగా మారినా ఆశ్చర్యం చెందనవసరం లేదు. ఆసక్తి యొక్క శక్తి అటువంటిది. అటువంటి ఆసక్తి.. పిల్లల్లో కొందరికి చదువుపై ఆసక్తి ఉంటే, మరి కొందరికి ఆటలలో ఆసక్తి ఉంటుంది. కొందరి చేతి పనులలో ఆసక్తి ఉంటుంది. ఇంకా వివరణగా చూస్తే చదువులో కొందరు వ్రాయడంలో ఆసక్తి చూపుతూ అక్షరాలను ప్రింటు వేసినట్టుగా వ్రాసేంతగా నేర్పరులు అవుతారు. మరికొందరు ఏదోక సబ్జెక్టులో ఆసక్తి కనబరస్తూ, భవిష్యత్తులో ఆయా రంగంలో పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. సోషల్ వైపు ఆసక్తి కనబరిస్తే, సోషల్ సర్వీసులలో ఐఏఎస్ అవ్వవచ్చు. సైన్స్ వైపు ఆసక్తి చూపితే డాక్టర్ అవ్వవచ్చు…
Read More

క్లాసు రూం పాఠాలు…పాటలుగా వింటే…

తెలుగులో 10th Class సబ్జెక్టులు వాయిస్ ద్వారా వినడం వలన ముందుగానే ఆయా సబ్జెక్టులలో అవగాహన ఏర్పడుతుందని, అలా వాయిస్ ద్వారా 10th Class పాఠాలు వినాలనే విద్యార్ధుల కొరకు, ఈ మొబైల్ యాప్ ద్వారా 10వ తరగతి సబ్జెక్టులలో లెసన్స్ వాయిస్ రూపంలో అందిస్తున్నారు… శ్రీమతి పద్మగారు. వాయిస్ రూపంలో తెలుగు మరియు ఇతర సబ్జెక్టు పాఠాలు వినడానికి ఇక్కడ ఇవే అక్షరాలను తాకండి. వినడం వలననే విద్య వస్తుంది, అయితే వినాలనే శ్రద్ద కలగడం చాలా ముఖ్యమంటారు. కొంతమందికి క్లాసులో వినేటప్పుడు సబ్జెక్టుపై అంతగా ఆసక్తి ఉండకపోవచ్చును. కొంత మంది ఆసక్తి ఉన్న చదవడానికి చికాకు ఉండవచ్చును. ఇంకా చెప్పేవారిలో కొందరి వాయిస్ అందరికీ అర్ధం అయ్యేలాగా ఉండకపోవచ్చును. ఇలా కొన్ని సమయాలలో కొంతమందికి క్లాసురూములో పాఠాలు ఆసక్తిని కలుగజేయకపోవచ్చు. ఆసక్తి లేకుండా చదువులో శ్రద్ధ చూపడం కష్టమంటారు. అలాంటప్పుడు ఆసక్తి కలగడంలో అవకాశం ఉండే విషయాలు గమనిస్తే…. మనసుకు ముందుగా తెలిసి ఉన్న విషయం, ఆ మనిషికి తెలిసినవారు ఎక్కడైనా మాట్లాడుకుంటూ ఉంటే, చూసిన మనసు, తనకు ముందుగానే పరిచయం ఉన్న విషయంపై ఆసక్తి కనబరిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా అయితే 9వ తరగతి విద్యార్థులు 10వతరగతికి వెళ్లే…
Read More