హైస్కూల్ విద్యాసమయం అత్యంత విలువైన కాలం.

పదవతరగతి పబ్లిక్ ప్రతి ఒక్కరు శ్రద్ద పెట్టి చదువు అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే చదువులో పదవతరగతి చాలా కీలకమైనది, పది పాస్ అయితేనే, కళాశాల చదువులు. వినడమే అలవాటు అయిన బాల్యంలో పిల్లలకు అప్పుడప్పుడు పరీక్షలు వ్రాయడం అలవాటు అయినా పదవతరగతి పబ్లిక్ పరీక్షలు అంటే తప్పనిసరిగా తప్పుతామేమో అనే భయం ఉంటుంది. ఇంకోపక్క మంచి మార్కులు సాధించాలనే పట్టుదల, పాస్ అవ్వలానే ఆశ ఉంటాయి. కానీ అందరూ పుస్తకం చదువుతారు, కొందరే విషయం గ్రహిస్తారు అని కొందరు అంటారు. కాదు అందరూ చదువుతారు, కొందరే శ్రద్ద పెడతారు. శ్రద్ద లేకపోవడం చేతనే అందరూ చదివిన సబ్జెక్టులో సారం గ్రహించలేరు. మీకు మీరు ఆసక్తి పెంచుకుని, ఒక క్రమశిక్షణతో శ్రద్ద పెడితే చదువులో మీరు అనుకుంటున్న దానికంటే మంచి ఫలితాలు సాధిస్తారు. "మీరు నా మాటలు లిటిల్ థింగ్స్ టు లిజన్ మొబైల్ యాప్ ద్వారా వింటున్నారు." అయితే అంతకుముందరి తరగతి పరీక్షలలో వచ్చిన ఫలితాలను బట్టి, పబ్లిక్ పరీక్షలంటే ఒక అభిప్రాయానికి కొందరు బాలబాలికలు వచ్చేసి ఉంటారు. కొందరు ర్యాంకు సాధించాలని అనుకుంటే, కొందరు ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ అవ్వలాని అనుకుంటారు. కొందరు ఎలాగోలా పాస్ అయితే చాలు అనుకుంటారు.…
Read More